పొలిటికల్ పవర్ పి యన్ 9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం .ప్రసాద్ రావు. కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు మండలంలో ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని తెలుగు రైతు మాజీ ఉపాధ్యక్షుడు, పామురి బాల్రెడ్డి, మరియు పార్టీ కార్యకర్తలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అడుగు బలహీన వర్గాల ప్రజల ఇబ్బందులను గుర్తించి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సమాజంలో ముందుండాలనే సంకల్పంతో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాలని, టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు యువత ఇంటింటికి వెళ్లి ఆరోగ్య ఆలనా పాలనా చూస్తూ ప్రభుత్వ సహకారముతో అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, పాలకొలను రమణారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, వెంకట్రామిరెడ్డి , లాకా శేఖర్, పామూరు ప్రతాపరెడ్డి ,మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.