POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 11:25 pm Posted by : POLITICAL POWER

కలసపాడు మండలంలో కూటమి ZPTC అభ్యర్థి భావనాసి విద్యావతి విజయమే లక్ష్యంగా ర్యాలీ…. మంచరు సూర్యనారాయణ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల ప్రచారం…..

కలసపాడు నవంబర్ 2 పొలిటికల్ పవర్ పిన్ 9 టివి. సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎం. ప్రసాదరావు.కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా.

బద్వేల్ నియోజకవర్గం, కలసపాడు మండలంలో కూటమి తరఫున పోటీ చేస్తున్న ZPTC అభ్యర్థి, భావనాసి విద్యావతి యొక్క విజయమే లక్ష్యంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, కూటమి ZPTC అభ్యర్థి, భావనాసి, విద్యావతి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ మరియు కడప DCC బ్యాంక్ చైర్మన్, శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి నాయకత్వంలో కూటమి అభ్యర్థి విజయానికి తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.