POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 7:52 pm Posted by : POLITICAL POWER

కలసపాడు లో జరిగే ఎన్నిక పై ప్రత్యేక నిఘా… ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం… పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్.. సుబ్రహ్మణ్యం… కలసపాడు నవంబర్ 3 పొలిటికల్ పవర్. పిన్ 9 టీవీ. సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్. ఎo. ప్రసాద్ రావు కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలంలో ఐదో తేదీ జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పిటిసి, ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నామని పూర్తి బందోబస్తు ఇచ్చామని, సీఐ. సుబ్రహ్మణ్యం తెలిపారు. మంగళవారం ఆయన కలసపాడు మండల పోలీస్ స్టేషన్ లో ఎస్సై హనుమంతు, మరియు వారి సిబ్బందితో కలిసి మాట్లాడుతూ, ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల దృష్ట్యా కొన్ని సూచనలు చేయడం జరిగింది .ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 లోని సెక్షన్ 214 ప్రకారం మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అభ్యర్థులందరూ ప్రచారం ముగించవలెను. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు కానీ అభ్యర్థులు గాని, ప్రచారం చేయరాదు.అలాగే బహిరంగ సభలు, ఊరేగింపులు, ర్యాలీలు, వీధి సభలు ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని సినిమా దూరదర్శన్ ఇతర దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ఎన్నికల ప్రచారం చేయడం కూడా నిషేధమని తెలిపారు.ఎన్నికల రోజు ఎవరి ఓటును వారు స్వేచ్ఛాయుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుంది. కావున ఎలక్షన్ రోజు జనాలు గుంపులు గుంపులుగా ఉండరాదు. ఎలక్షన్ రోజు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొనబడును.పోలింగ్ జరిగే గ్రామీణ స్థానిక సంస్థల పరిధిలోని ఓటర్లకు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఉన్న రాజకీయ నాయకులు , వ్యక్తులు గాని, నగదు, మద్యం, బహుమతుల పంపిణీ అలాగే బయట వ్యక్తుల కదిలికలపై నిరంతర నిఘా ఉంచడమైనది. ప్రజలు అభ్యర్థులు రాజకీయ పార్టీ నాయకులు, ఎన్నికల నియమాలిని తప్పనిసరిగా పాటిస్తూ ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు సహకరించాలని తెలిపారు. ఈ ఎన్నికల నిమిత్తం సర్కిల్ పరిధిలో ఒక డిఎస్పి, 5 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 7 మంది సభ్యులు,5 మంది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, 19 మంది హెడ్ కానిస్టేబులు, 124 మంది కానిస్టేబుళ్లు, 18 మంది మహిళా కానిస్టేబుళ్లు, 34 మంది హోంగార్డులతో, కలిపి మొత్తం 213 మంది పోలీసు అధికారులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో కలసపాడు మండల ఎస్సై హనుమంతు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

 

కలసపాడు నవంబర్ 3 పొలిటికల్ పవర్. పిన్ 9 టీవీ. సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్. ఎo. ప్రసాద్ రావు

కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలంలో ఐదో తేదీ జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పిటిసి, ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నామని పూర్తి బందోబస్తు ఇచ్చామని, సీఐ. సుబ్రహ్మణ్యం తెలిపారు

 

మంగళవారం ఆయన కలసపాడు మండల పోలీస్ స్టేషన్ లో ఎస్సై హనుమంతు, మరియు వారి సిబ్బందితో కలిసి మాట్లాడుతూ, ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల దృష్ట్యా కొన్ని సూచనలు చేయడం జరిగింది .ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 లోని సెక్షన్ 214 ప్రకారం మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అభ్యర్థులందరూ ప్రచారం ముగించవలెను. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు కానీ అభ్యర్థులు గాని, ప్రచారం చేయరాదు.అలాగే బహిరంగ సభలు, ఊరేగింపులు, ర్యాలీలు, వీధి సభలు ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని సినిమా దూరదర్శన్ ఇతర దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ఎన్నికల ప్రచారం చేయడం కూడా నిషేధమని తెలిపారు

.ఎన్నికల రోజు ఎవరి ఓటును వారు స్వేచ్ఛాయుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుంది. కావున ఎలక్షన్ రోజు జనాలు గుంపులు గుంపులుగా ఉండరాదు. ఎలక్షన్ రోజు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొనబడును

.పోలింగ్ జరిగే గ్రామీణ స్థానిక సంస్థల పరిధిలోని ఓటర్లకు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఉన్న రాజకీయ నాయకులు , వ్యక్తులు గాని, నగదు, మద్యం, బహుమతుల పంపిణీ అలాగే బయట వ్యక్తుల కదిలికలపై నిరంతర నిఘా ఉంచడమైనది. ప్రజలు అభ్యర్థులు రాజకీయ పార్టీ నాయకులు, ఎన్నికల నియమాలిని తప్పనిసరిగా పాటిస్తూ ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు సహకరించాలని తెలిపారు

. ఈ ఎన్నికల నిమిత్తం సర్కిల్ పరిధిలో ఒక డిఎస్పి, 5 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 7 మంది సభ్యులు,5 మంది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, 19 మంది హెడ్ కానిస్టేబులు, 124 మంది కానిస్టేబుళ్లు, 18 మంది మహిళా కానిస్టేబుళ్లు, 34 మంది హోంగార్డులతో, కలిపి మొత్తం 213 మంది పోలీసు అధికారులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో కలసపాడు మండల ఎస్సై హనుమంతు మరియు సిబ్బంది పాల్గొన్నారు.