
– కాసుల కక్కుర్తితో కొందరు స్వార్థపరులైన వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు,
– సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడిని కాల్షియం కార్బైడ్, ఇతర రసాయాలను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నా
వ్యాపారులు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక వనపర్తి జిల్లా బ్యూరో 17.జూన్ 2026.
వేసవి కాలం రాకతో పండ్లలో రారాజు మామిడి మార్కెట్‌లో సందడి చేస్తోంది. అయితే, నోరూరించే ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయన్న నిజాన్ని ప్రజలు విస్మరించకూడదు. కాసుల కక్కుర్తితో కొందరు స్వార్థపరులైన వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడిని కాల్షియం కార్బైడ్, ఇతర రసాయాలను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారు. రోడ్డు పక్కన బండ్ల మీద నిగనిగలాడుతూ, పసిడి వర్ణంతో కంటికి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతి పండునూ నాణ్యమైనదిగా భావించి కొనుగోలు చేయడం అంటే అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకోవడమే.సాధారణంగా సహజంగా పండిన పండు అంతటా ఒకే రంగులో ఉండదు, కానీ రసాయనాలతో మగ్గించిన పండ్లు పైన పసుపు పచ్చగా ఉండి, లోపల మాత్రం పచ్చిగా ఉండి విషతుల్యంగా మారుతాయి. ఇలాంటి పండ్లను తినడం వల్ల గొంతు మంట, కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు వంటి తక్షణ సమస్యలతో పాటు, దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కల్తీ వ్యాపారుల పట్ల పోలీస్ విభాగం ఉక్కుపాదం మోపాలి. కల్తీ మామిడి పండ్లపైనా హెచ్-ఫాస్ట్ నిఘా ఉంచుతోంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ప్రజలు రూపాన్ని చూసి మోసపోకుండా, సహజత్వాన్ని గుర్తించి పండ్లను కొనుగోలు చేయాలని కోరుతున్నారు. సహజంగా పడిన పండ్ల కంటే అసహజమైన రంగు, రసాయన వాసన, వింత రుచి కలిగిన మామిడి పండ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పండ్లపై అసాధారణ మచ్చలున్నా లేదా బేకింగ్ సోడా నీటిలో కడిగినప్పుడు రంగు మారినా అవి ఆరోగ్యానికి హానికరమని గ్రహించాలి.
1, మామిడిని కాల్షియం కార్బైడ్ ఇతర రసాయాలను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్యిస్తున్నారు.
1, మామిడిని కాల్షియం కార్బైడ్ ఇతర రసాయాలను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్యిస్తున్నారు.
ఎన్. వెంకటరమణ. రైతు గ్రామం ముమ్మాల్లాపల్లి
కొత్తకోట మండలం వనపర్తి జిల్లా.
సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడిని కాల్షియం కార్బైడ్, ఇతర రసాయాలను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారు. రోడ్డు పక్కన బండ్ల మీద నిగనిగలాడుతూ, పసిడి వర్ణంతో కంటికి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతి పండునూ నాణ్యమైనదిగా భావించి కొనుగోలు చేయడం అంటే అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకోవడమే.సాధారణంగా సహజంగా పండిన పండు అంతటా ఒకే రంగులో ఉండదు, కానీ రసాయనాలతో మగ్గించిన పండ్లు పైన పసుపు పచ్చగా ఉండి, లోపల మాత్రం పచ్చిగా ఉండి విషతుల్యంగా మారుతాయి. ఇలాంటి పండ్లను తినడం వల్ల గొంతు మంట, కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు వంటి తక్షణ సమస్యలతో పాటు, దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది.
2, కల్తీ మామిడి పండ్లపైనా హెచ్-ఫాస్ట్ నిఘా ఉంచుతోంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.
గుండ్రాతి కృష్ణయ్య గౌడ్ నాటవెల్లి గ్రామం.కొత్తకోట
మండలం. వనపర్తి జిల్లా.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కల్తీ వ్యాపారుల పట్ల పోలీస్ విభాగం ఉక్కుపాదం మోపాలి. కల్తీ మామిడి పండ్లపైనా హెచ్-ఫాస్ట్ నిఘా ఉంచుతోంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. ప్రజలు రూపాన్ని చూసి మోసపోకుండా, సహజత్వాన్ని గుర్తించి పండ్లను కొనుగోలు చేయాలి. సహజంగా పండిన పండ్ల కంటే అసహజమైన రంగు, రసాయన వాసన, వింత రుచి కలిగిన మామిడి పండ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పండ్లపై అసాధారణ మచ్చలున్నా లేదా బేకింగ్ సోడా నీటిలో కడిగినప్పుడు రంగు మారినా అవి ఆరోగ్యానికి హానికరం.సహజంగా పండిన మామిడి పండ్లను కాకుండా కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకర రసాయనాలు కలిపిన మామిడి పండ్లను మార్కెట్‌లో ఎక్కువ ధరలు విక్రయిస్తున్నారు. సమ్మర్ వచ్చేసిందంటే చాలు చాలా మంది మామిడి పండ్లు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. మామిడి పండ్లు చాలా తియ్యగా, రుచిగా ఉండటంతో చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది సహజంగా పండిన మామిడి పండ్లను కాకుండా, కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకర రసాయనాలు కలిపిన మామిడి పండ్లను మార్కెట్‌లో ఎక్కువ ధరలు విక్రయిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికీ మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా మామిడి పండ్లు తింటారు. అయితే కొన్ని సార్లు కల్తీ మామిడి పండ్లు తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా కల్తీ మామిడి పండ్ల వలన వాంతులు, విరేచనాలు, తల తిరగడం, చివరకు క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.



