తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ నాయకుల ధర్నా

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 18 2026: బీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో నిరుపేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. కులమత భేదాలు లేకుండా అర్హులైన ఆడబిడ్డల వివాహానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాలను కొనసాగించడంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా పథకాలను వెంటనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. పథకాలను అమలు చేయకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ శ్రీమతి సుగుణకు బీఆర్‌ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సామ్యా నాయక్, సర్పంచులు రామకృష్ణ, నరసింహులు గౌడ్, రవి నాయక్, మాజీ సర్పంచులు పీనా నాయక్, గోపాల్ నాయక్, మన్యం గౌడ్, బాలస్వామి, బీఆర్‌ఎస్ నాయకులు చిన్న ఆంజనేయులు గౌడ్, పోలిశెట్టి ప్రతాప్, బుచ్చిబాబు గౌడ్, పెద్ద మల్లారెడ్డి, అంజిరెడ్డి, కేశవరెడ్డి, మహేష్, మాధవ్ గౌడ్, సింగోటం, రామన్ గౌడ్, మూన్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.