– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గజానంద్ దేశాయి
కామారెడ్డి జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ యునుస్ పటేల్
సర్పంచుల ఫోరం ప్రెసిడెంట్ బాచావార్ లక్ష్మణ్ పటేల్ 
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ బషీర్ కామారెడ్డి జిల్లా స్టాఫ్ బ్యూరో పేద, బడుగు బలహీన వర్గాల వైద్య సహాయార్థం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశానుసారం శనివారం డోంగ్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు, అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ఆర్థిక సహాయం అందించడంలో సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా గజానంద్ దేశాయి అన్నారు. యునుస్ పటేల్ మాట్లాడుతూ… ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటారని తెలిపారు, సహాయం అందుకున్న లబ్దిదారులు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారికి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు, బాచావార్ లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ… పేద ప్రజల వైద్య ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంర్ఫ్ సాయం ఎంతో మందికి భరోసా ఇస్తుంది. ఈ సంక్షేమ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందినందుకు
పేదలకు వైద్యం: తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ యూనుస్ పటేల్, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు లక్ష్మణ్ బచావార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, సర్పంచ్లు సంగ్రామ్ పటేల్, బస్వరాజ్ పటేల్, దత్తు, మాజీ ఎంపిటిసి దీన్ దయాల్, నాయకులు చాంద్ పటేల్, విలాస్ పటేల్, ఉమాకాంత్ పటేల్, ప్రవీణ్ పాటిల్, రవికిరణ్, ముల్తాన్, తదితరులు పాల్గొన్నారు.