POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 2:35 pm Posted by : POLITICAL POWER

కవయిత్రి మొల్ల విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు.. 11న భూమిపూజ

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేతుల మీదుగా భూమిపూజకు సన్నాహాలు

కుమ్మర కుల బంధువులంతా పెద్ద సంఖ్యలో తరలిరావాలి: సంఘం నాయకుల పిలుపు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 07 2026: వనపర్తి జిల్లా కేంద్రంలో మహాకవయిత్రి మొల్లమాంబ విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 11వ తేదీన విగ్రహ నిర్మాణ స్థలంలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించేందుకు కుమ్మర సంఘం నాయకులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శనివారం కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరు మండల కేంద్రాల్లో కుమ్మర సంఘం నాయకులు సమావేశాలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు సత్యం, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ నరేష్, యువజన సంఘం అధ్యక్షుడు మేఘశ్యామ్, మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, యువజన సంఘం అధ్యక్షుడు ఈశ్వర్ ఆధ్వర్యంలో ఈ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా కుల ఐక్యత, సంఘటిత శక్తిని చాటేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11న జరిగే మొల్లమాంబ విగ్రహ భూమిపూజ కార్యక్రమానికి వనపర్తి జిల్లాలోని కుమ్మర కుల బంధువులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. మహాకవయిత్రి మొల్లమాంబ మన కుమ్మర కులానికి గర్వకారణమని, ఆమెకు గౌరవ సూచకంగా విగ్రహ ప్రతిష్ఠాపన చేపట్టడం ఆనందకరమని నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో కౌన్సిలర్ పరుశురాం, సంఘం పట్టణ గౌరవ అధ్యక్షుడు బొంబాయి మన్యంకొండన్న, మన్యం, తిరుపయ్య, రవి, నర్సింహ, వాసు, శ్రీరాజ్ తదితరులు పాల్గొన్నారు.