POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 7:10 pm Posted by : POLITICAL POWER

కవి ఉప్పరి తిరుమలేష్‌కు ఘన సన్మానం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 18 2026: తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యంలో సాహిత్య ప్రతిభా పురస్కారం అందుకున్న కవి, రచయిత ఉప్పరి తిరుమలేష్‌ను సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శుక్రవారం పట్టణంలోని ఎన్ టి ఆర్ లలిత కళా తోరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షులు పలస శంకర్ గౌడ్ మాట్లాడుతూ… ఉప్పరల జీవన నేపథ్యంపై వెలువడిన తొలి దీర్ఘకవిత సంపుటి ‘మెట్న’కు ఆయనకు ఈ పురస్కారం లభించిందని చెప్పారు. భవన నిర్మాణ శ్రామికుల జీవితం, తాపీ వృత్తి శ్రమ సౌందర్యాన్ని సాహిత్యంలో ప్రతిబింబిస్తూ ఉన్నతమైన రచన చేసినందుకు తిరుమలేశ్ కు ఈ పురస్కారం ఇవ్వడం అభినందనీయం అని కొనియాడారు. గత ఒకటిన్నర దశాబ్దాల ఆయన సాహిత్య సేవలో ఇప్పటికీ పది కవిత సంపుటాలు ప్రచురింపబడటం ప్రశంసనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు కందూరు నారాయణ రెడ్డి, జనజ్వాల, బైరోజు చంద్ర శేఖర్, సి.కిరణ్ కుమార్, బండారు శ్రీనివాస్, రాము తదితరులు పాల్గొన్నారు.