మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.
ఘటకేశ్వర్ : అమిత్ షా మహా పాదయాత్రలో పాల్గొన్న మేడ్చల్ బీజేపీ ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి.
SIRపై కాంగ్రెస్ దుష్ప్రచారం మానుకోవాలి. ప్రజల్లో అపోహలు సృష్టించడం సరికాదు అని, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించడం తగదు అని, ఓటర్ల జాబితాలో పారదర్శకత, అర్హులైన ఓటర్ల హక్కుల పరిరక్షణే లక్ష్యం.
కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రజలకు వాస్తవాలు వివరించాలి. భాగ్య నగరంలో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా చేపట్టిన మహా పాదయాత్రలో మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. మేడిపల్లి డివిజన్ బీజేపీ నాయకులతో కలిసి బస్సులో హైదరాబాద్కు చేరుకున్న ఆయన, అనంతరం మహా పాదయాత్రలో పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలో పారదర్శకతను పెంపొందించేందుకు చేపడుతున్న SIR (స్పెషల్ ఇంటెన్షవ్ రెవిషన్) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ, అనవసర భయాందోళనలు కలిగిస్తోందని విమర్శించారు. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యతను విస్మరించి, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని అన్నారు.
SIR ప్రక్రియపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయడమే లక్ష్యం.ఓటర్ల జాబితా పారదర్శకత, అర్హులైన ఓటర్ల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించడం అవసరమని ఆయన పేర్కొన్నారు. SIR ప్రక్రియపై ఎలాంటి అపోహలకు గురికాకుండా అధికారిక సమాచారం ఆధారంగా వాస్తవాలను తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు.
కాంగ్రెస్ విమర్శలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారు అని ఆయన వివరించారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను ఆయన తప్పుబట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందించేలా రాజకీయ పార్టీలు వ్యవహరించాలని, ప్రజల్లో అనవసర గందరగోళం సృష్టించే ప్రచారానికి స్వస్తి పలకాలని హితవు పలికారు.ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ కట్టుబడి ఉంది అని తెలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహా పాదయాత్ర ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దోహదపడుతుందని ఏనుగు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకుని SIR ప్రక్రియకు సంబంధించిన వాస్తవాలను వివరించాలని పిలుపునిచ్చారు.
దేశంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, అర్హులైన ఓటర్ల హక్కుల సంరక్షణకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ మహా పాదయాత్రలో డివిజన్ అధ్యక్షులు జమ్ముల ప్రభాకర్ రెడ్డి, బీజేవైఎం సీనియర్ నాయకులు బండారు పవన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, స్వరూప్ చంద్ర, సంతోష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గీతారామ్, రాణి సుధాకర్, మల్లారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పవన్ యాదవ్, సుధాకర్ చారి, బీజేపీ నాయకులు, యువమోర్చా కార్యకర్తలు భారీ పాల్గొన్నారు.