POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 6:28 pm Posted by : POLITICAL POWER

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులుగా గద్దల అప్పారావు నియామకం


పొలిటికల్ పవర్, అశ్వారావుపేట, అర్ సి ఇంచార్జ్.(మేడపురెడ్డి నాగార్జున):కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడిగా గద్దల అప్పారావు నియమితులయ్యారు. స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ గద్దల రమేష్ చేతుల మీదుగా గద్దల అప్పారావుకు శుక్రవారం అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు.
​నూతన అధ్యక్షుడిగా నియామక పత్రాన్ని అందుకున్న గద్దల అప్పారావు మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణకు, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ గద్దల రమేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని ఎస్సీ వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తానని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఎస్సీ కుటుంబానికి చేరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఎస్సీ సెల్‌ను గ్రామ స్థాయి నుండి మరింత బలోపేతం చేస్తామని, పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
​ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మరియు జిల్లా చైర్మన్ గద్దల రమేష్ మాట్లాడుతూ… గద్దల అప్పారావు నాయకత్వంలో అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎస్సీ సెల్ మరింత చురుగ్గా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గాల హక్కుల పరిరక్షణకు, పార్టీ అభివృద్ధికి శ్రమించాలని కోరుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఎస్సీ సెల్ ప్రతినిధులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలియజేశారు.