POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 2:34 pm Posted by : POLITICAL POWER

కాంగ్రెస్ పార్టీ పాలనలో తారాస్థాయికి చేరిన అవినీతి.

ఆరు నెలల్లోనే 2025 రికార్డును దాటేసిన ఏసీబీ కేసులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టివీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 05 2026: మూడేళ్ల క్రితం వరకూ తలసరి ఆదాయంలో, ధాన్యం ఉత్పత్తిలో, ఐటీ ఎగుమతుల్లో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగుల్లో, గ్రామీణాభివృద్ధిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో రికార్డులు సృష్టించేది తెలంగాణ రాష్ట్రం. రేవంత్ రెడ్డి వచ్చాక మాత్రం నేరాల్లో, మద్యం అమ్మకాల్లో, అవినీతిలో టాప్ ర్యాంక్ సాధించి తలవంపులు తెస్తోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మీద ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయిల్లో విచ్చలవిడిగా అవినీతి పెరగడంతో ఇదే అదనుగా కింద ఉన్న ఉన్నతాధికారుల నుండి చిరుద్యోగుల వరకూ చెలరేగిపోతున్నారు. అవినీతి నిరోధక శాఖ రోజూ ఎక్కడో ఒకచోట అవినీతి అధికారులను ట్రాప్ చేసి పట్టుకున్నా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాకపోగా ఏటా ఏసీబీ కేసుల సంఖ్య పెరిగిపోతుండటం తెలంగాణలో పెచ్చరిల్లుతున్న అవినీతికి నిదర్శనం. 2025 ఏడాది మొత్తం నమోదైన ఏసీబీ కేసుల సంఖ్యను 2026లో ఆరునెలల్లోనే దాటేయడం చూస్తే కాంగ్రెస్ పాలనలో అవినీతి ఎంత దారుణంగా పెరిగిందో అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా రేవంత్ చేతిలో ఉన్న పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, పొంగులేటి చేతిలో ఉన్న రెవెన్యూ, భట్టి చేతిలో ఉన్న ఫైనాన్స్, రెవెన్యూ శాఖలు అవినీతిలో టాప్ స్థాయిలో ఉన్నాయి. దీన్ని బట్టే పైనున్న మంత్రుల పరిస్థితి ఏమిటో తెలుసుకోవచ్చు.