“ కాంగ్రెస్ పాలనలో మహిళ ఎమ్మెల్యేలకే రక్షణ లేదా?”

పోలీసుల తీరుపై కాసాని నాగశేషా పద్మ తీవ్ర ఆగ్రహం.. ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని ఫైర్‌ పొలిటికల్ పవర్,అశ్వారావుపేట, సెప్టెంబర్ 07: అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును అశ్వారావుపేట బీఆర్‌ఎస్‌ నాయకురాలు కాసాని నాగశేషా పద్మ తీవ్రంగా ఖండించారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాసాని నాగశేషా పద్మ మాట్లాడుతూ.. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారని, జుట్టు పట్టుకుని...