కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వల్లే మరో ఇరిగేషన్ ప్రాజెక్టు DPR వెనక్కి! సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ డీపీఆర్‌ను తిప్పి పంపిన కేంద్ర జలవనరుల శాఖ ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేకూర్చడానికే తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని తీవ్ర విమర్శలు
పొలిటికల్ పవర్ (సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / PN9 TV న్యూస్) AP & TS బ్యూరో: యర్ర నాగరాజు రెడ్డి హైదరాబాద్ / ఉమ్మడి ఖమ్మం: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలనాపరమైన అసమర్థత కారణంగా తెలంగాణకు అత్యంత కీలకన మరొక సాగునీటి ప్రాజెక్టు తీవ్ర ప్రతిష్టంభనలో పడింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో రూ. 9,257 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) ప్రాజెక్టు డిటైల్డ్...