కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గుర్రం అన్నపూర్ణ మృతి
మహబూబాబాద్ (పొలిటికల్ పవర్): మాలోత్ అజయ్ నాయక్ (గార్ల ) మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు గుర్రం అన్నపూర్ణ అనారోగ్య కారణాలతో హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ సమాచారం అందుకున్న బయ్యారం పట్టణ, గంధంపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆమె స్వగృహానికి చేరుకుని భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నివాళులర్పించిన వారిలో...