POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 7:56 pm Posted by : POLITICAL POWER

కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించిన ఆదర్శ కుటుంబం జగనన్న దంపతులు

మాజీ ఎంపీ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి కుమారుడి వివాహ ఎంగేజ్‌మెంట్‌కు హాజరైన శ్రీ వైయస్‌ జగన్‌

నీనా–ఇషాన్‌లను ఆశీర్వదించిన శ్రీ వైయస్‌ జగన్‌ దంపతులు

బెంగళూరులో జరిగిన మాజీ ఎంపీ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి కుమారుడు ఇషాన్‌ వివాహ ఎంగేజ్‌మెంట్‌ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌, శ్రీమతి వైయస్‌ భారతి దంపతులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులు నీనా–ఇషాన్‌లను శ్రీ వైయస్‌ జగన్‌ దంపతులు ఆశీర్వదించి, వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.

ఈ వేడుకలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి దంపతులతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.