POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 4:56 pm Posted by : POLITICAL POWER

కామాంచికల్ గ్రామంలో ఘనంగా శ్రీ సర్వయీ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఈరోజు కామాంచికల్ గ్రామంలో శ్రీ సర్వయీ పాపన్న గౌడ్ విగ్రహం ఘనంగా ఆవిష్కరించబడింది. 1709లో ఢిల్లీ మొఘల్ సామ్రాజ్యంలో నెలకొన్న రాజకీయ అల్లకల్లోలాన్ని ఆసరాగా చేసుకుని, సర్దార్ సర్వయీ పాపన్న గౌడ్ చారిత్రాత్మక గోల్కొండ కోటను స్వాధీనం చేసుకుని తెలంగాణను పాలించిన మహనీయుని చరిత్రకు గుర్తుగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ అమర్గాని వెంకటేశ్వర్లు (గౌడ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు), శ్రీ బడపట్ల వెంకన్న (జిల్లా అధ్యక్షులు), డా. రాజశేఖర్ గౌడ్ , ఉడుగు శ్రీనివాస్ గౌడ్ , పోతగాని కృష్ణారావు , బండి నగేష్ , గండి రవి పాల్గొన్నారు. అలాగే కామాంచికల్ సొసైటీ చైర్మన్ అంతుల లక్ష్మీనారాయణ , గౌడ సంఘ పెద్దలు గాడేపల్లె ఉపేందర్, పల్లె నరసింహరావు, సహాయ కార్యదర్శులు యాసరపు రాములు, బోయినపల్లి శ్రీను గౌడ్ మోక్క మల్లయ్య తో పాటు గ్రామ గౌడ సంఘానికి చెందిన సుమారు 150 మంది సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.