ఏం చేశారని జనం కూటమికి ఓట్లేస్తారు
’ మాజీ మంత్రి ఆర్కేరోజా
కార్డు జేబులో ఉంటే ….. జగనన్న గుండెల్లో ఉన్నట్లే
- ’ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు భూమన
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
కూటమి పార్టీ నేతలు రెండున్నరేళ్లలో ఏం చేశారని ప్రజలు వారికి స్థానిక ఎన్నికల్లో ఓట్లేస్తారని మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. బుధవారం సాయంత్రం నగరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గత ఎన్నికల్లో అబద్దాలు చెప్పి మభ్యపెట్టారు… ఎదోచేస్తుందని ఆశlపడ్డాం.. ఆపై మోసపోయాం అంటూ జనం బాధపడుతున్నారన్నారు. చంద్రబాబు ఎప్పుడొచ్చినా మోసమే చేస్తారు. ఆయన జీవితంలో మారరన్నవిషయం ప్రజలకు బోధపడిందన్నారు. ఒక్కసారి తప్పుచేశాం.. ఇక ఆ తప్పులు చేయకూడదన్న బలమైన నిర్ణయానికి ప్రజలు వచ్చారన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు జనం సిద్దంగా ఉన్నారన్నారు. అందుకే కూటమి నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను బెదిరించి, కేసులు పెట్టి లొంగధీసుకునే ప్రయత్నాలు చేసే ఆలోచనలో ఉన్నారన్నారు. అందరూ కలసికట్టుగా పంచాయతీల్లో, మున్సిపపల్ వార్డుల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ నేతలకు జనంలో వెళ్లడానికి ధైర్యం లేదన్నారు. మేము ఇది చెప్పాం ఇది చేశాం అని చెప్పే పరిస్థితిలో వారు లేరన్నారు. ఫించన్లు అరకొరగా ఇస్తున్నారుని, కొత్త పెన్షన్లు లేవు. వికలాంగుల పెన్షన్లు తీసేశారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలు చూడొద్దు అర్హత ఉంటే అందరికీ న్యాయం చెయ్యండి అని చెప్పిన జగనన్న హుందాతనం, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అని తెలిసినా, అనుమానం వచ్చినా ఎటుంవంటి సంక్షేమాలు అందించొద్దు, ఎలాంటి అభివృద్ధి చెయ్యకూడదని దిగజారుడు తరం ప్రజలు తెలుసుకున్నారన్నారు. ఒక చిన్న తప్పు చేసినందుకు రెండున్నరేల్లుగా కష్టపడుతున్నాం అని జనం బాదపడుతున్నారని వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంది. ప్రతి పంచాయతీ, వార్డులో రిజర్వేషన్ల వారిగా ఏది వస్తే ఎవరిని పెట్టాలని నిర్ధారించుకోండి లేకుంటే పచ్చ పార్టీ వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరి తరపున పోరాడడానికి తాను సిద్దంగా ఉన్నానన్నారు. ప్రతి లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరి విజయం కోసం తాను సాయశక్తులా కృషిచేస్తానన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు నిజాయితీ అయిన సైనికుల్లా పనిచేస్తే విజయం మనదే అన్నారు.
కార్డు జేబులో ఉంటే ….. జగనన్న గుండెల్లో ఉన్నట్లే
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు కార్డు జేబులో ఉంటే జగనన్న గుండెల్లో ఉన్నట్లే అని తిరుపతి, చిత్తూరు జిల్లాల పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు రానునాక్నయని రోజమ్మకు మీకు ఎంత బలాన్ని చేకూరుస్తున్నారో ఆ ఎన్నికలే చెబుతాయన్నారు. ఎన్నికల్లో కూటమిని ధీటుగా ఎదుర్కొని మన పార్టీ తరపున నిలబడిన వారిని గెలిపించినపుడే ప్రతి ఒక్కరూ జగనన్న సైనికులు అవుతారన్నారు. మోసం తెలియని వ్యక్తి, ప్రజలకు మేలు చేయాలన్న తపన ఉన్న వ్యక్తి రోజా అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేసే వ్యక్తి రోజమ్మ కాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో నాయకత్వ పటిమ ఏమాత్రం తగ్గలేదని అందుకే ప్రభుత్వం వారిపై చేస్తున్న దాష్ఠికాలు అన్నీ ఇన్నీ కావన్నారు. కుప్పంలో సమన్వయకర్త భరత్, జడ్పీచైర్మన్ శ్రీనివాసులుపై జరిగిన పరిణామాలే నిదర్శనమన్నారు. వారు చెప్పనటువంటి మాటల్ని పచ్చపత్రికలు, మీడియా ద్వారా చిత్రీకరించి వారిపైనే కేసులు పెట్టారన్నారు. ఎంపీటీసీపై వారే దాడిచేసి అతనిపైనే కేసు పెట్టారన్నారు. వీటన్నింటినీ అధిగమించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. నేడు పార్టీ శ్రేణులకు జగనన్న సంతకంతో ఇచ్చే గుర్తింపు కార్డు మన బ్రాండ్ ఇమేజ్‌ను తెలియజేస్తుందన్నారు. దారుణాలకు ఒడిగట్టే తెలుగుదేశ పార్టీ పచ్చ మూకలకు ఎదురొడ్డాల్సిన అవసరాన్ని చాటిచెప్పేవిధంగా జగనన్న సైనికులుగా నియోజకవర్గంలో పార్టీ జెండాను ఎగురవేయాలని. రోజమ్మను బలోపేతం చెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు రాహుల్‌రాజారెడ్డి, నగరి, పుత్తూరు మున్సిపల్ మాజీ చైర్మన్లు నీలమేఘం, హరి, మాజీ వైస్ ఛైర్మన్లు జయప్రకాష్, వెంకటరత్నం, పుత్తూరు మండల ఎంపీపీ మునివేలు, నగరి, పుత్తూరు మున్సిపల్ పార్టీ అధ్యక్షులు రమేష్‌రెడ్డి, ఏకాంబరం, రాష్ట్రకమిటీ నాయకులు కాయం గాంధీ, రవీంద్ర, గుణశేఖర్, శేఖర్‌రాజు, శ్యామ్‌లాల్, చిరంజీవి, జిల్లా కమిటీ నాయకులు, నియోజకవర్గ బూత్‌కమిటీ కన్వీనర్ సురేష్‌రాజు, మండల పార్టీ అధ్యక్షులు తిరుమలరెడ్డి, శివరాజు, వేణురాజు, సుబ్రమణ్యం రెడ్డి, మాజీ ఎంపీపీలు దీప, మంజు బాలాజీ, నియోజకవర్గ, మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు