POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 4:49 pm Posted by : POLITICAL POWER

కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న మోడీ

AITUC జిల్లా డిప్యూటీ సెక్రటరీ ఆత్మకూరి చిరంజీవి

AITUC రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ సెక్రటరీ ఆత్మకూరు చిరంజీవి అన్నారు. బుధవారం వాంకిడి హాస్పిటల్ లో కార్మికులతో కలిసి AITUC రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశ స్వతంత్రానికి ముందు 1920 అక్టోబర్ 31న ఏఐటీయూసీ ఆవిర్భవించిందని నాటి నుంచి నేటి వరకు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి 44 కార్మిక చట్టాలను సాధించడం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల మేలుకోసమే వ్యాపారం సులభతరం పేరుతో 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడలుగా తయారు చేశారని, కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్ కొడులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం కార్పోరేట్ల మేలు కోరుతుందని కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా తయారు చేస్తుందని,కనీస వేతనం 26,000 చెల్లించాలని, ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రవేటికరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. SPMలో గుర్తింపు కార్మిక సంఘాలు వెంటనే నిర్వహించాలని,పాత కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా డ్యూటీలోకి తీసుకోవాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వాంకిడి హాస్పిటల్ ను 100 పడకల హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేయాలని,సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు కరీంనగర్ లో జరుగుతాయని ఈ మహాసభలకు జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిట్ కౌర్ తో పాటు దేశ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని అన్నారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గం మహాసభలలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి కొదురుపాక మహేష్ ఏఐటియూసి నాయకులు ఇటాన్కర్ తిరుపతి, ధర్మయి రాకేష్, డోంగ్రే ప్రశాంత్ చంద్రకళ,సిద్దు తోపాటు తదితరులు పాల్గొన్నారు.