పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 11.2026.
వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ సెంటర్ లో ఏఐటియుసి , సిఐటియు, టి యు సి ఐ , రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గంట పాటు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. పోలీసులకు కార్మిక సంఘాల నాయకులు మధ్య తోపులాట జరిగింది అనంతరం కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్మిక సంఘాల నాయకులను విడుదల చేయాలని కార్మికులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు చేరుకొని నినాదాలు చేశారు, పోలీసులు సొంత పూచీకత్ పై కార్మిక సంఘాల నేతలను విడుదల చేశారు, ఈ రాస్తారోకోను ఉద్దేశించి ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మోష, ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ ఎన్. రమేష్, మండ్ల రాజు, టి యు సి ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుర్మయ్య, అరుణ్ కుమార్, ఏఐకేస్ జిల్లా కార్యదర్శి రాబట్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పరమేష్ ఆచారి జిల్లా ఉపాధ్యక్షులు జి ఎస్ గోపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ అజయ్, మేకల ఆంజనేయులు తెలంగాణ ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజన్న వెంకటయ్య మాట్లాడుతూకార్పొరేట్ల ఆక్రమణకు, న్యాయమైన వేతనాలను తిరస్కరించడానికి వ్యతిరేకంగా కార్మికులు, రైతుల ఐక్యతను చాటడమ. అన్ని పంటలను రాష్ర్ట ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేందుకు హామీ కల్పించడంతో పాటూ, సిటు ప్లస్ 50 శాతం ఫార్ములాతో లెక్కించిన మేరకు పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ను ఇచ్చేందుకు చట్టబద్ధమైన హామీ కల్పించాలన్న డిమాండ్
దీనికి తోడు, నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనాన్ని పెంచాలని, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే స్వేచ్ఛావాణిజ్యఒప్పందాలనుపూర్తిగాతిరస్కరించాలని,ప్రతిపాదితవిత్తనబిల్లు,2025నుఉపసంహరించుకోవాలని, విద్యుత్ ప్రైవేటీకరణ, ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్ నాలుగులేబర్,కోడ్లనుతక్షణమేరద్దుచేయాలి.కార్మికులందరికీ నెలకు రూ.31 వేలు చొప్పున కనీస వేతనం చెల్లించాలి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ)ని పునరుద్ధరించి, 200 రోజుల పని దినాలు, రోజుకు రూ.700 దినసరి వేతనం అమల్జేయాలి.సార్వత్రిక సామాజిక భద్రత ఫించనునెలకురూ.10వేలుచొప్పునఅందజేయాలి.ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ప్రతిపాదించిన సి2 ప్లస్ 50 శాతం ఫార్ములాతో అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. దేశ వ్యవసాయ రంగాన్ని ప్రమాదంలోకి నెట్టేసేలా అమెరికాతో చేసుకున్న అన్ని స్వేచ్ఛావాణిజ్యఒప్పందాలనుఉపసంహరించుకోవాలి.వ్యవసాయ, ఆహార శుద్ధి, ఆహార ఎగుమతులు, అలాగే వ్యూహాత్మక ఎంఎస్‌ఎంఇ రంగాల్లో విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు(ఎఫ్‌డిఐ)లనుఅనుమతించరాదు.భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఎ)ని రక్షించి మరింత బలోపేతం చేయాలి.ఎఫ్‌సిఐ గోదాముల స్థానంలో అదానీ – లీప్ ఇండియా గుత్తాధిపత్యానికి తెర దించాల విద్యుత్ ప్రయివేటీకరణ బిల్లు 2025, విత్తన బిల్లు 2025, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి. సహకార సంస్థల్లో కార్పొరేట్ సంస్థల ఆక్రమణలను ఆపేయాలి. అన్నదాతల నేతృత్వంలో ప్రజాస్వామిక సహకార సంస్థలను బలోపేతం చేయాలి.సమగ్రమైన రుణ మాఫీ పథకాన్ని ప్రకటించి అప్పుల ఊబిలో నుంచి గ్రామీణ ప్రజలను గట్టెక్కించాలి. ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేయాలి.బలవంతపు భూసేకరణను, కార్పొరేట్ భూసమీకరణను ఎటువంటి పరిస్థిత్లోనూ చేపట్టకూడదు.భూ సేకరణ చట్టం 2013, అటవీ హక్కుల చట్టం 2006, పీసా 1996 చట్టాల ప్రకారం భూ హక్కులను పరిరక్షించాలి. ఎరువులు, ఇంధనం, వంటగ్యాసు, పెట్రోలు,డీజిల్,ధరలనునియంత్రించాలి. సబ్సిడీలను పునరుద్ధరించాలి. రైతులందరికీ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పంటల బీమా, పశువుల బీమా కల్పించాలివాటర్‌షెడ్లను అభివృద్ధి చేసి ప్రతి పొలానికి నీటిసౌకర్యంకల్పించాలి.వరదలు, కరువువంటిప్రకృతివిపత్తులసమయంలోపారదర్శకమైన సహాయాన్ని అందజేయాలి. ఇందుకోసం తగిన నిధులుకేటాయించాలి.విద్యకోసంస్థూలజాతీయోత్పత్తి (జిడిపి)లో 6 శాతం నిధులు కేటాయించాలి.కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో 6 శాతం, అలాగే జిడిపిలో 3 శాతం నిధులను పరిశోధన, అభివృద్ది రంగానికి కేటాయించాలి. ఈ కార్యక్రమం నికి సిపిఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రమేష్, ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయి లీల, లక్ష్మి, డి హెచ్ పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వంశీ, ఎంపీ ఆర్డీ నాయకులు మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఏఐటియుసినాయకులు చిన్న కురుమన్న, శ్రీను, నరసింహ, నరేందర్,గాంధీ, పెద్ద మొగులయ్య,రిక్షా రాములు, టి యు సి ఐ నాయకులు గణేష్, పెంటయ్య దేవమ్మ,సి. రాజు, సిఐటియు నాయకులు బొబ్బిలి నిక్సన్, సూర్యవంశం రాము, బుచ్చమ్మ,ఎస్ రాజు,సునీత, శారద, కవిత తదితరులు పాల్గొన్నారు.


