POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 6:59 pm Posted by : POLITICAL POWER

కార్మికులకు కనీస వేతనాల పెంపు బూటకం.

కనీస వేతన మండలి సిఫార్సులు బుట్టదాఖలు.

జీవో నెంబర్ 6 సవరించి కనీస వేతనం 26 వేలకు పెంచాలి.

-ఎం.డి.యూసుఫ్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతన మండలి సభ్యులు.

ప్రభుత్వాల నూతన ఆర్థిక విధానాలు కార్మికుల సంక్షేమానికి గొడ్డలి పెట్టు.

ఆసుపత్రి కార్మికులకు జీతాలు పెంచకపోతే సమ్మె తప్పదు.

 -ఎం నరసింహ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 05 2026: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన కార్మికుల కనీస వేతనాల పెంపు బూటకం అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతన బోర్డు సభ్యులు యం.డి.యూసుప్ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రస్తుత “కానీస వేతనాలు-కార్మికుల జీవనస్థితిగతులు” అనే అంశంపై తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పీ.సురేష్ అధ్యక్షతన జిల్లాస్థాయి సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఎం.డి.యూసుఫ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర కనీస వేతన బోర్డులో సుదీర్ఘకాలం కార్మికుల సంక్షేమం దృష్ట అనేక అంశాలను అధ్యయనం చేసి బోర్డు సభ్యులు అందరూ ఏకగ్రీవంగా కనీస వేతనం కిందిస్థాయి కార్మికులకు 20,250 నుండి 3 కేటగిరీలుగా 28 వేల వరకు పెంచాలని స్పష్టంగా నివేదిక సిఫార్సులు అందజేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తాజాగా ప్రభుత్వం కనీస వేతనాలను పెంచిందని అయితే పెంచిన కనీస వేతనాలు కార్మికుల జీవన ఆరోగ్య ఆర్థిక భద్రతకు ఎలాంటి భద్రత కల్పించే విధంగా లేదని మండిపడ్డారు. తెలంగాణ కవినిస వేతన పోటు చేసిన సిఫారసులను పరిగణలోకి తీసుకోకుండా ఆశాస్త్రీయంగా వేతనాల పెంపు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే బుట్ట దాఖలు చేసిన సిఫారసులను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కనీస వేతన తాజా జీవో 6 ను సవరించి కార్మికులకు 26వేల వేతనం పెంచే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు కార్మికుల సంక్షేమానికి గొడ్డలి పెట్టుగా మారుతున్నాయని ధ్వజమెత్తారు. ఆసుపత్రి పారిశుద్ధ సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులకు ప్రతి మూడు సంవత్సరాలకు ఓసారి టెండర్ గైడ్లైన్స్ ప్రకారం పెరగాల్సిన వేతనాలు నాలుగేళ్లు గడుస్తున్న ఒక్క పైసా కూడా పెంచకపోవడం బాధాకరమని అన్నారు. రోగుల మలమూత్రాలు ఎత్తిపోసి వెలకట్టలేని సేవలు అందిస్తున్న కాంట్రాక్టు కార్మికులందని ప్రభుత్వం వేషరతుగా పెర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఆసుపత్రి కార్మికులకు కనీస వేతనం 26వేలకు పెంచాలని లేకపోతే సమ్మె తప్పదని హెచ్చరించారు. విపనగండ్ల ఆసుపత్రి పడకల సామర్థ్యం తగ్గింపు సరికాదని ఆరోపించారు. కార్మికులు హక్కుల సాధన ఐక్య పోరాటలతో సాధ్యమని వేతనాల పెంపుకై క్షేత్రస్థాయి నుండి మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు శ్రీహరి, జిల్లా ప్రధాన కార్యదర్శి మోష, జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, జిల్లా నేత జి.రమేష్, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ సీనియర్ నాయకులు శ్రీనివాస్,ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ నేత భరత్, వనపర్తి బ్రాంచ్ అధ్యక్షులు గంధం శీను, సీనియర్ నాయకులు నరసింహ, లింగం శెట్టి, నాయకులు నరేందర్, కుమార్, రాజేష్, కృష్ణ, జలాల్, ఖదీర్, మోహన్, వెంకటేష్ భీమయ్య, బాలరాజ్, కళావతి, లక్ష్మి, పార్వతమ్మ, పెంటమ్మ, భాగ్యమ్మ, సంతోషమ్మ, భాగ్య, మన్నెమ్మ, చెన్నమ్మ, లక్ష్మి, భూదేవి, పార్వతమ్మ, చెన్నమ్మ, వరలక్ష్మి, లింగమ్మ, రవి తదితరులు పాల్గొన్నారు.