“కార్యకర్తకు కష్టం.. తాటి అండ”
చిలకరావును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు – నారాయణపురంలో ఘన స్వాగతం అశ్వారావుపేట, పొలిటికల్ పవర్ ఆగస్టు 29:అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు పులగడప చిలకరావును బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, బూర్గంపహాడ్–అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పరామర్శించారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో కాలు విరిగి గాయపడిన చిలకరావు ఖమ్మంలోని ఓ ప్రముఖ వైద్యశాలలో చికిత్స పొందారు. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న విషయం తెలుసుకున్న తాటి వెంకటేశ్వర్లు ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు....