– అన్యాయంపై అక్షర సమరం చేసినప్రజాకవి,ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కాళోజీ సాహిత్యం కీలక పాత్ర,
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్. సెప్టెంబర్ -10.2026.
అన్యాయంపైఅక్షరసమరంచేసినప్రజాకవి,ప్రజల్లోచైతన్యంతీసుకురావడంలోకాళోజీసాహిత్యంఎంతోకీలక పాత్రఅనిఏఆర్.అదనపుఎస్పీ.వీరారెడ్డిఅన్నారు.బుధవారంవనపర్తిజిల్లాపోలీసుకార్యాలయంలోతెలంగాణ ప్రజాకవి,స్వాతంత్ర్యసమరయోధుడు,ప్రజాఉద్యమాల గొంతుక శ్రీ కాళోజీ నారాయణరావు గారి జయంతి కార్యక్రమాన్ని ఏఆర్ అదనపు ఎస్పీ.వీరారెడ్డి పోలీసు కార్యాలయం అధికారులు, సిబ్బంది కలిసి కాళోజీ నారాయణరావుచిత్రపటానికిపూలమాలవేసిఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ.మాట్లాడుతూప్రజలబాధనుతనబాధగాభావించి, అన్యాయాన్ని నిర్భయంగా ప్రశ్నించిన మహోన్నత ప్రజాకవి కాళోజీ నారాయణరావు. తన కలం ద్వారా సమాజంలోని అసమానతలు, ప్రజల సమస్యలను వెలుగులోకితీసుకువచ్చిప్రజల్లోచైతన్యాన్నిరగిలించిన ఆయన సేవలు చిరస్మరణీయం. కాళోజీసాహిత్యం కేవలంరచనలకుపరిమితంకాకుండాప్రజాచైతన్యానికి ఒకఉద్యమంగానిలిచింది.ఆయనఆశయాలస్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలి. పోలీసు అధికారులు, సిబ్బంది కూడా ప్రజల సమస్యలనుసానుభూతితోఅర్థంచేసుకుని,నిష్పక్షపాతంగా, అంకితభావంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కాళోజీఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మరింతమెరుగైనసేవలు అందించేందుకుపోలీసుఅధికారులు,సిబ్బందిఅంకితభావంతోపనిచేయాలనిఅదనపుఎస్పీ.పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిసిఆర్పి డిఎస్పీ, బాలాజీ నాయక్, పోలీస్ కార్యాలయం ఏఓ, సునంద, స్పెషల్ స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు,పర్వతాలు, రామేశ్వర్ రెడ్డి, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, వినోద్, మగ్దుం భారీ, పోలీసు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, గోవింద్, పోలీస్ సిబ్బంది, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.
