కుళ్ళిన అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన గౌతమ బుద్ద స్వచ్చంద సేవా సంస్ధ
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ దమ్మపేట జూలై6 2026: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని జమేదారు బంజర పరిసర అటవీప్రాంతంలో ఈ నెల 1 వ తేదీన మృతి చెందిన అనాద మహిళా మృతదేహానికి సోమవారం గౌతమ బుద్ద స్వచ్చంద సేవా సంస్ధ ఆద్వర్యంలో అంత్యక్రియలు జరిపారు. స్ధానిక పోలీసులు అనాద మృతదేహాన్ని గత మూడు రోజుల క్రితం అశ్వారావుపేట లోని ప్రభుత్వ వైద్యశాల కు పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. మృతదేహానికి సంబందించిన బంధువులు ఎవరూ...