POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 1:20 pm Posted by : POLITICAL POWER

కూలిన వంతెనను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా

ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చెయ్యండిపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ఎన్విఆర్ 9 టీవీ న్యూస్ ఆర్సి కారం వెంకటేష్ సెప్టెంబర్ 26 2026: ములకలపల్లి మండలం రాజుపేట వద్ద కూలిపోయిన( బ్రిడ్జి) ఘటనపై అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు స్పందించారు.కూలిపోయిన వంతెనను స్వయంగా పరిశీలించారు. వంతెన కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మెచ్చా నాగేశ్వరరావు సంబంధిత శాఖ ఉన్నత అధికారులతో మాట్లాడుతూ తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని.కంపగూడెం వైపుగా వెళ్లి మార్గం అలాగే మాధారం వైపుగా వెళ్లి మార్గాలు బాలేనందున మరమ్మతులు చేపట్టి ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు.అలాగే కూలిపోయిన వంతెన స్థానంలో శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల బి.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు సెనగపాటి సీతారాములు, బండి కొమరయ్య, పుష్పాల చందర్, రావుకొండవీటి చంద్ర శేఖర్, సునీల్, సున్నం బాబు రావు, పుష్పాల హనుమంత్, మాజీ మండల యువజన విభాగం అధ్యక్షుడు తాటి ప్రవీణ్, సిద్దెల వెంకటేష్, శేషు, పుష్పాల సాయి, కంపాటి సొందు, బొర్రా రవి తదితరులు ఉన్నారు.