కృష్ణాష్టమి రోజు భక్తులకు అన్నదానం

కీర్తిశేషులు బండారి సవరయ్య, బండారి నరసింహ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 5 2026: పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కృష్ణాష్టమి సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీకృష్ణుని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కీర్తిశేషులు బండారి సవరయ్య, బండారి నరసింహ కుటుంబ...