POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 6:51 pm Posted by : POLITICAL POWER

కేంద్రంతో సంబంధం లేకుండా..రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనాలి

– కేంద్రం ఎంత కొంటే రైతుల వద్ద తాము అంతే వరి ధాన్యమునుకొంటామనిప్రకటించడంసిగ్గుచేటు,
– రైతుబంధు మూడుసార్లు ఎగ్గొట్టారని,రైతు బీమాఇన్సూరెన్స్,చెల్లించకుండరైతుబీమాకుపంగనామంపెట్టారు,
– శంకర సముద్రం ప్రాజెక్టును వెంటనే పూర్తిచేసి నిర్వాసితులకు బకాయిపడ్డా పరిహారాన్ని వెంటనే చెల్లించాలి,
– మాజీ జెడ్పి వైస్ చైర్మన్ వామన్ గౌడ్,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 21.2026.
కేంద్రంతో సంబంధం లేకుండా రైతు పండించిన ప్రతి గింజను కొనాల్సిందేనని, లేని పక్షంలో ఉద్యమించి రైతు పక్షాన నిలబడి ప్రభుత్వ మెడలు వంచుతామని మాజీ జెడ్పి వైస్ చైర్మన్ వామన్ గౌడ్ అన్నారు.ఆదివారం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పిటిసి పొగాకు విశ్వశ్వర్,మాజీ సీడిసి చైర్మన్ బీసం చెన్నకేశవరెడ్డిలతో కలిసి మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు, మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి కేంద్రం ఎంత కొంటే రైతుల వద్ద తాము అంతే వరి ధాన్యమునుకొంటామనిప్రకటించడంసిగ్గుచేటనిఅన్నారు.రైతాంగం ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం సకాలంలో కొననందుకురెండునెలలపాటుకల్లాలవద్దఉండిఅవస్థలుఎదుర్కున్నారని కొందరి పంటలు వర్షానికి తడవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.బోనస్ ను ఎగ్గొట్టడానికి పండించిన వరి పంటను ప్రభుత్వం సకాలంలో కొనలేదని ఆరోపించారు.గత సీఎం కేసిఆర్  ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిన రైతులు పండించిన ప్రతి గింజను కొన్నారని, అదే స్ఫూర్తితో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటను కొనాలని డిమాండ్ చేశారు.అనంతరం మాజీ జెడ్పిటిసి పొగాకు విశ్వేశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్,ప్రభుత్వంఏర్పడి30నెలలుదాటినఎన్నికలకంటేముందుకాంగ్రెస్అగ్రనేతలుసోనియాగాంధీ,రాహుల్ గాంధీ,ప్రియాంకగాంధీ,ఖడ్గేగార్లసాక్షిగాప్రకటించిన6గ్యారంటీలు,420 గ్యారెంటీలను నేటి వరకు అమలు చేయలేదనిఅన్నారు.రైతుబంధుమూడుసార్లుఎగ్గొట్టారని,రైతుబీమాఇన్సూరెన్స్,చెల్లించకుండారైతుబీమాకుపంగనామంపెట్టారని,విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ అందించకుండా మోసం చేశారని, దీంతో విద్యార్థుల సర్టిఫికెట్లు రాక అవస్థలు ఎదుర్కొంటున్నారని పై చదువులకు వెళ్లలేక వారి బతుకులు ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. కెసిఆర్  హయాంలో 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు ప్రాజెక్టుతో పాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొత్తకోట మండల వరదాయిని వనపర్తి, కొల్లాపూర్ కు సాగునీరు, త్రాగునీరు అందించే శంకర సముద్రంప్రాజెక్టునువెంటనేపూర్తిచేసినిర్వాసితులకు బకాయిపడ్డా పరిహారాన్ని వెంటనే చెల్లించాలని కోరారు.అనంతరం పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ 14వ వర్ధంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల సమర్పించి తెలంగాణ రావడానికి విద్యావంతుల వేదికను తయారుచేసి ఉద్యమంలో కేసీఆర్ కి అండగా నిలిచి వారు చేసిన కృషిని త్యాగాన్ని గుర్తు చేసుకుని ఘన నివాళి అర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్,ఎద్దుల నగేష్ , మున్సిపల్ కౌన్సిలర్లుఎరుకలి తిరుపతయ్య,
అయ్యన్న, అడ్వకేట్ యాదగిరి, సత్యమ్ యాదవ్, సాదిక్ అలీ, అస్కని శ్రీను, యుగంధర్ రెడ్డి, గులాబీ గోవిందు,పసుపుల నెహ్రు, గోపాల్ నాయక్, మహేష్,సాయి,మాజీ కౌన్సిలర్లు,సింగిల్ విండో డైరెక్టర్లు,మాజీ కోఆప్షన్ సభ్యులు,మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.