అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ కట్టి శుభాకాంక్షలు
పొలిటికల్ పవర్, హైదరాబాద్ ఆగస్టు 28: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని అశ్వారావుపేట యువజన విభాగం మాజీ నియోజకవర్గ అధ్యక్షులు మోటూరు మోహన్ కుమార్తె ఇవాంక, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావుకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఇవాంక హిమాన్షుకు రాఖీ కట్టి, స్వీట్లు తినిపించారు. అనంతరం అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగను కుటుంబ సభ్యుల సమక్షంలో ఆత్మీయంగా జరుపుకున్నారు.
రాఖీ కట్టిన అనంతరం హిమాన్షు ఇవాంకకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆమెకు ఆశీస్సులు అందించారు. దీంతో ఇరువురి మధ్య ఆత్మీయ అనుబంధాన్ని చాటిచెప్పేలా రాఖీ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య కొనసాగాయి.అలాగే
కేటీఆర్ తనయుడిని అశ్వారావుపేట బిఆర్ఎస్ నాయకులు భూక్య ప్రసాద్, మహిళా నాయకులు కాసాని పద్మ, డాక్టర్ ఉదయ జ్యోతిలతో కలిసి శాలువాతో సత్కరించారు.
