POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 1:38 pm Posted by : POLITICAL POWER

కొడంగల్‌కు భారీగా తరలివెళ్లిన పామిరెడ్డిపల్లి రైతులు, కాంగ్రెస్ శ్రేణులు

రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోకు విశేష స్పందన

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 9 2026: కొడంగల్‌లో నిర్వహిస్తున్న రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో, భారీ బహిరంగ సభకు పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు, డీసీసీ ఉపాధ్యక్షుడు టీ. సాయి చరణ్ రెడ్డి సూచనలతో గ్రామం నుంచి రైతులు, కాంగ్రెస్ శ్రేణులు సమిష్టిగా బయలుదేరారు. గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ ఇందిరా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి భారీగా తరలివెళ్లారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడంలో రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో దోహదపడతాయని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రాములమ్మ హనుమంతు, వార్డు సభ్యులు, వ్యవసాయ అధికారి మహేశ్వరి, నాయకులు రాకాసి భీమ్‌రెడ్డి, నాగేంద్ర సాగర్, సందడి మన్యపు రెడ్డి, ఎండీ షౌకత్, నరసింహ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు గ్రామ రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.