POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 7:45 pm Posted by : POLITICAL POWER

కొత్తకోటలో అయ్యప్ప భక్తుల కోసం నిత్య అన్నప్రసాద వితరణ ప్రారంభం


– మకర సంక్రాంతి వరకు కొనసాగనున్న అన్నదాన కార్యక్రమం,

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.12.2026.వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప క్షేత్రం ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప దీక్షాధారుల కోసం నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమితి వ్యవస్థాపకులు జోషి గోపాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా మకర సంక్రాంతి వరకు నిత్య అన్నప్రసాద వితరణ కొనసాగుతుందని తెలిపారు. ప్రతిరోజూ సుమారు 500 మంది వరకు అయ్యప్ప భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారని పేర్కొన్నారు.
కొత్తకోట పరిసర ప్రాంతాల్లో సుమారు 400 మంది అయ్యప్ప భక్తులు, అదేవిధంగా శబరిమల యాత్రకు పాదయాత్రగా, వాహనాల్లో వెళ్లే అయ్యప్ప స్వాములకు ఈ అన్నప్రసాద వితరణ ఎంతో సౌకర్యంగా ఉంటోందని తెలిపారు. యాత్రకు వెళ్లే, తిరుగు ప్రయాణంలో ఉండే భక్తులు సైతం ప్రతిరోజూ సుమారు 200 మంది వరకు అన్నప్రసాదం స్వీకరిస్తున్నారని వివరించారు.గోపాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో అర్చకులు జంగం నటరాజ్, అనీల్ గార్లు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. తొలిరోజు సుమారు 120 మంది అయ్యప్ప భక్తులు దీక్ష స్వీకరించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు దూపం నాగరాజు, నిర్వాహకులు అనిల్ కుమార్, కవిందర్ రెడ్డి, మద్దిగట్ల బాలకృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, లింగేశ్వర్, గంగాధర్ , సత్యం సాగర్ ,శ్యామ్ సుందర్ గౌడ్ , రవి రెడ్డి , రఘునాథ్ రెడ్డి , ఉమా మహేశ్వర రెడ్డి , యాది రెడ్డి , డా’ మోహన , వై ఎస్. రాజశేఖర్ , మోహన్ రెడ్డి , కట్ట శ్రీను , రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.