కొత్తకోటలో ఘనంగా కొత్వాల్ రాజ బహుదూర్ వెంకట రామారెడ్డి జయంతి వేడుకలు
పొలిటికల్ పవర్ దినపత్రిక పిఎన్ 9టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 23.2026.కొత్వాల్,రాజబహుదూర్,వెంకటరామారెడ్డి జయంతి వేడుకలను కొత్తకోట రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో వేముల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శనివారం కొత్తకోట చౌరస్తాలో రెడ్డి బంధువులతో పాటు వివిధ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు.హైదరాబాదు నగర తొలి కొత్వాల్, విద్యాదాత ప్రాముఖ సామాజిక సేవకులు శ్రీ రాజా బహుదూర్ వెంకట్రాం రెడ్డి 158 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. నిజాం కాలపు...