Date of Publish : 17 June 2026, 5:57 pmPosted by : POLITICAL POWER
కొత్తకోట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుని సన్మానించిన ఎమ్మెల్యే జి.ఎం ఆర్
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 17. 2026.
వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రనికి చెందిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షునిగా దేశి పెంటన్న యాదవ్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను వనపర్తి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నికైన నిర్వహించి ఆయన చేతుల మీదుగా నియామక పత్రం అందించారు. నూతనముగా ఎన్నికైన దేశి పెంటన్న యాదవ్ నుబుధవారం హైదరాబాదులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జి మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలవడం తో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శాలువాతో సన్మానించారు.ఈ
సందర్భంలో దేశి పెంటన్న యాదవ్ మాట్లాడుతూ మా పై నమ్మకం ఉంచి ఈ పదవులు ఇచ్చినందుకు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డి లకుముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మాపై నమ్మకం ఉంచి ఈ పదవులు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు న్యాయం చేకూరుస్తా మాని, పార్టీ కొరకు కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జెసిబి రాము, జై. సుభాష్ , సాయిరాం తదితరులు పాల్గొన్నారు.