POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 6:03 pm Posted by : POLITICAL POWER

కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పులు (నార్మల్ డెలివరీ)జరిగే విధంగా చూడండి


–బిఆర్ ఎస్ మాజీ జడ్పీ వైస్ చైర్మన్ జి. వామన్ గౌడ్, కొత్తకోట పట్టణ మాజీ సర్పంచ్, సిడిసి మాజీ చైర్మన్ భీసం చేన్నకేశవరెడ్డి,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 20.2026.కొత్తకోట ప్రభుత్వ హాస్పిటల్ లోగర్భిణిలకు సాధారణ కాన్పులు(నార్మల్ డెలివరీ లు) జరిగే విధంగా చూడాలని బిఆర్ ఎస్ మాజీ జడ్పీ వైస్ చైర్మన్ జి. వామన్ గౌడ్ , కొత్తకోట పట్టణ మాజీ సర్పంచ్, సిడిసి మాజీ చైర్మన్.భీసంచేన్నకేశవరెడ్డిఅన్నారు.బుధవారంవనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డిఎంహెచ్ ఓ భాస్కర్, ఆసుపత్రి డాక్టర్ ర్లతోకలిసిఆసుపత్రిపరిసరాలను,పనితీరునుపరిశీలించారు.ఈ సందర్భంగా బిఆర్ ఎస్ మాజీ జడ్పీ వైస్ చైర్మన్ జి. వామన్ గౌడ్ , కొత్తకోట పట్టణ మాజీ సర్పంచ్, సిడిసి మాజీ చైర్మన్ భీసం చేన్నకేశవరెడ్డి    డిఎంహెచ్ ఓ భాస్కర్ తో  మాట్లాడుతూ హాస్పిటల్ పనితీరును మెరుగుపరచాలనితగిన మందులు అందుబాటులో ఉంచుకుని హాస్పిటల్ సిబ్బందిని పెంచి 24 గంటలు వైద్యసేవాలు అందించాలని గర్భిణిలకు సాధారణ కాన్పులు(నార్మల్ డెలివరీ లు) జరిగే విధంగా చూడాలని డిఎంహెచ్ ఓ భాస్కర్, హాస్పిటల్ డాక్టర్లను కోరారు.ఈ కార్యక్రమంలో   చర్లపల్లి మాజీ సర్పంచ్ శ్యాం కూమార్, బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు పసుపుల పద్మా నెహ్రూ, మాసన్న  హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.