
– జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆఫీసు అంటు జిటి.నారాయణ స్కూల్ లోపల
ఒక్కొకరిని లోపలికి పిలిచి లక్షల రూపాయలు వసూళ్ళు,
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్. 09. 2026.వనపర్తి జిల్లా
కొత్తకోట మున్సిపల్ లోని వనపర్తి వెళ్లే రోడ్డు మార్గంలో గల జీటి. నారాయణ స్కూల్ దగ్గర
జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆఫీసు పెట్టి వ్యాపారస్తులు మహిళలతో జాతీయ మానవ హక్కుల సామాజిక న్యాయం సంఘం పేరు చెప్పుకొని దయ్యాల శేఖర్, రాఘవేందర్ యాదవ్ అనేవ్యక్తులుదౌర్జన్యంగాపేదవ్యాపారస్తుల దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని ఎమ్మార్పీఎస్ నాయకులు జనంపల్లి కిరణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు గా రాఘవేంద్రర్ యాదవ్, కొత్తకోట మండల అధ్యక్షుడు గా దయ్యాల శేఖర్ మాదిగ అని చెప్పుకుంటూ శేఖర్ భార్య కి లక్షల రూపాయలు అమౌంట్ కొట్టించుకొన్నారనిశనివారం సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతోరాత్రికి రాత్రే ఈ బోర్డును తొలగించడం జరిగిందని, వీరు పెట్టిన బోర్డు అన్ని అనుమతులతో పెడితే, అక్రమంగా వీళ్లు డబ్బులు వసూలు చేయకపోతే రాత్రికి రాత్రే ఈ బోర్డు ఎందుకు తొలగించేవారని అన్నారు. దయ్యాల శేఖర్, రాఘవేందర్ యాదవ్ వీరిద్దరూ చీటర్స్.
ఈ ఇద్దరి నుండిమరికొంతమందిమోసపోకూడదనే ఉద్దేశంతో వీరి అక్రమాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగిందని అన్నారు.సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత, నాకు కూడా కొంతమంది బాధితులు ఫోన్ చేసి మమ్మల్ని కూడా వీరిద్దరూ మోసం చేశారని ఫోన్ ద్వారా తెలపడం జరిగిందని అన్నారు. కొత్తకోట మండల అధ్యక్షుడుదయ్యాల శేఖర్, జిటి. నారాయణ స్కూల్ యజమాని రాఘవేందర్ యాదవ్ బాధితుల దగ్గర అక్రమంగా వసూలు చేసిన డబ్బులను కొత్తకోట పోలీసులు విచారణ జరిపి, బాధితుల డబ్బులు బాధితులకు ఇప్పించి, ఈ ఇద్దరిపై సుమోటోగా కేసు నమోదు చేసి, భవిష్యత్తులో వీరు ఇలాంటి పనులు చేయకుండా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.