POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 3:03 pm Posted by : POLITICAL POWER

కొత్తకోట లో ఘనంగా బీజేపీ సిద్ధాంత కర్త పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ 110 వ. జయంతి వేడుకలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.26.2026.కొత్తకోట లో ఘనంగా బీజేపీ సిద్ధాంత కర్త పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ110వ.జయంతిఉత్సవాన్నిపురస్కరించుకునికొత్తకోట పట్టణం చౌరస్తాలో ఆయన చిత్రపటానికిపూలమాలలువేసినివాళులర్పించిఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలోకొమ్ముభరత్.భూషణ్,జిల్లాఉపాధ్యక్షులు ప్రసంగించారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, ఉన్నతచదువులను అభ్యసించి,రాష్ట్రీయస్వయంసేవకసంఘసిద్ధాంతాలకు ఆకర్షితుడైఆజన్మబ్రహ్మచారిగా,భారతసమాజానికి నిస్వార్థ సేవలను అందించిన మహానుభావులు అని కొనియాడారు.ఆద్య సరసంగచాలక్ ఆజ్ఞ మేరకు భారతీయ జన సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి తోడ్పాటును అందించుట కొరకై సంస్థాగతప్రధానకార్యదర్శిగాఉంటూ,భారతీయ జన సంఘ ను దేశమంతా విస్తరించుట కై అవిశ్రాంతంగా పనిచేశారు.1966 లో ఏకాత్మ మానవ వాదం అనే సిద్ధాంతాన్ని పార్టీకిఅందించినసిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ. సమాజంలో గల చిట్టచివరిపేదవాడికిప్రభుత్వఫలాలనుఅందించాలన్నదే అంత్యోదయ సిద్ధాంతం. భారతీయ జనసంగే భారతీయ జనతా పార్టీ గా ఆవిష్కృతమైంది.భారత ప్రధాని నరేంద్రమోడీ12సంవత్సరాలుగాఉపాధ్యాయ ఆవిష్కరించిన అంత్యోదయ సిద్ధాంతంలో భాగమే ఉచితబియ్యం, ఉచిత గ్యాస్ పంపిణీ, ఉచిత బ్యాంకు ఖాతాల ప్రారంభం లాంటి అనేక పథకాలు. ప్రధాని అందిస్తున్న పథకాలు వారి సిద్ధాంతాలను సజీవంగా ఉంచుతున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో గల పేదవారు సంపూర్ణంగా ప్రభుత్వ ఫలాలను అందుకోవాలంటే,ఈరాష్ట్రంలోభాజాపాఅధికారంలోకి రావాలి.అందుకొరకువారి110వజయంతిసందర్భంగా కార్యకర్తలమైన మనమందరముపార్టీనిఅధికారంలోకి తేవడం కొరకు కంకణ భద్దులమవుతామని ప్రతిజ్ఞ చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో దాబా శ్రీనివాసరెడ్డి,పబ్బాo.నరేందర్.గౌడ్,సాయిరాం,కోటీశ్వర్ రెడ్డి, చీర్ల నరసింహ, శ్రీకాంత్ రెడ్డి,ఆవుల రాఘవేందర్ గౌడ్,అప్పరాల నరసింహ, సత్యం సాగర్, ఖాజా మైనోద్దీన్ , వినోద్ గౌడ్, జాను నాయక్, ఏలియా, నందిమల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.