కొత్తగూడ ఏజెన్సీలో అక్రమ బహుళ అంతస్తులు నిర్మాణాలను తక్షణమే తొలగించాలి… ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తే సహించం! అధికారుల మౌనం వెనుక ముడుపుల మాయాజాలం?

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి : ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులకు రక్షణ కవచంగా నిలవాల్సిన చట్టాలు కొత్తగూడ మండల కేంద్రంలో కాగితాలకే పరిమితమవుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో భూమిని, స్వయంపాలనను పరిరక్షించే 1/70 చట్టం, పెసా (PESA) నిబంధనలను బహిరంగంగా కాలరాస్తూ గిరిజనేతరులు సాగిస్తున్న అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆదివాసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి సాగుతున్న ఈ కాంక్రీట్ దందాపై ‘ఆదివాసి హక్కుల పోరాట సమితి...