కొమరిపాలెంలో “యూత్ కనెక్ట్” కార్యక్రమం – యువతకు మార్గదర్శనం
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే 03: తూర్పుగోదావరిజీల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామంలో ఆదివారం సాయంత్రం పంచాయతీ కార్యాలయం వద్ద “యూత్ కనెక్ట్ ప్రోగ్రామ్” సమావేశం నిర్వహించారు. రాత్రి 7.00 గంటల నుండి 8.20 గంటల వరకు జరిగిన ఈ సమావేశాన్ని బిక్కవోలు ఎస్సై వి. రవిచంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, సమాజానికి ఉపయోగపడే దిశగా ముందుకు సాగాలని అవగాహన కల్పించడం. ముఖ్యంగా...