POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 8:16 am Posted by : POLITICAL POWER

కోడుమూరులో వైఎస్సార్‌సీపీ ధమాకా: జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న కోట్ల భానుశ్రీ!

 

కోడుమూరు/కర్నూలు: పొలిటికల్ పవర్ ప్రతినిధి దస్తగిరి. పి

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పవర్ ఏంటో నిరూపించుకుంది. హోరాహోరీగా సాగిన స్థానిక సంస్థల సంగ్రామంలో ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొడుతూ వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేసింది.

కోడుమూరు జడ్పీటీసీ స్థానంలో కోట్ల హరి చక్రపాణి రెడ్డి సతీమణి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోట్ల భానుశ్రీ 638 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కంచుకోట లాంటి ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ ప్రజాదరణను మరోసారి చాటిచెబుతూ ఈ అఖండ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు.

మండలంలోనూ వైఎస్సార్‌సీపీ పైచేయి!

జెడ్పీటీసీలోనే కాదు.. కోడుమూరు मंडल పరిషత్ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలకు గాను 10 స్థానాలను దక్కించుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది.

* వైఎస్సార్‌సీపీ: 10 స్థానాలు

* తెలుగుదేశం పార్టీ: 9 స్థానాలు

* సీపీఎం: 01 స్థానం

* స్వతంత్ర అభ్యర్థి: 01 స్థానం

టీడీపీ నుంచి తీవ్ర పోటీ ఎదురైనప్పటికీ, వ్యూహాత్మకంగా వ్యవహరించిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీల్లోనూ స్పష్టమైన మెజార్టీని సాధించి మండలంలో తన పట్టును నిలబెట్టుకుంది. జడ్పీటీసీతో పాటు అత్యధిక ఎంపీటీసీ స్థానాలు వైఎస్సార్‌సీపీ వశం కావడంతో కోడుమూరు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ, బాణాసంచా కాల్చి అట్టహాసంగా సంబరాలు జరుపుకుంటున్నారు!