పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 10 2026: అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న టీడీపీ గౌస్ ను సాహితీ కళా వేదిక ప్రతినిధులు మంగళవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న టీడీపీ గౌస్ హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ శస్త్రచికిత్స చేయించుకుని రెండు రోజుల క్రితం వనపర్తికి వచ్చారు. విషయం తెలుసుకున్న సాహితీ కళా వేదిక ప్రతినిధులు ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలతో మందులు వాడితే త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటావని కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ ఆయనకు ధైర్యం చెప్పారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ రంగంలో ఉంటూ మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న తనకు చంద్ర శేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం అందించి శస్త్రచికిత్స చేయించారని గౌస్ కాగితంపై రాసి తన కృతజ్ఞతను తెలిపారు. గౌస్ ను పరామర్శించిన వారిలో సాహితీ కళా వేదిక సభ్యులు బైరోజు చంద్రశేఖర్, దేశి రాములు, గద్దె భాస్కర్, బండారు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.