-డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 10 2026: వనపర్తి పాలిటెక్నిక్ గ్రౌండ్ లో ఆరేపల్లి వెంకటేశ్వర్లు స్మారక 72వ స్టేట్ సీనియర్ మెన్, ఉమెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోస్తవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హాజరై గెలుపొందిన ఉమెన్ టీం విన్నర్ రంగారెడ్డి జట్టు, రన్నర్ వరంగల్ జట్టు, మెన్ విన్నర్ వరంగల్ జట్టు, రన్నర్ నల్గొండ జట్టు విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ… బ్యాడ్మింటన్ క్రీడ శారీరక దృఢత్వంతో పాటు మానసిక చురుకుదనాన్ని పెంచే క్రీడ అని అన్నారు. క్రీడలు మనలు క్రమశిక్షణ పట్టుదల సమయపాలన వంటి గొప్ప లక్షణాలను పెంపొందించేందుకు తోడ్పడతాయని అన్నారు. క్రీడాకారులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని నిరంతరం సాధన చేస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒలంపిక్స్ కు ఆడి మెడల్స్ సాధించి మన ప్రాంతానికి గుర్తింపు తేవాలని అన్నారు. క్రీడల్లో మహిళ భాగ్యస్వామ్యం పెరుగుతుండటం ఎంతో ఆనందకరమైన విషయమని, మహిళా క్రీడాకారులు తమ ప్రతిభతో రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు శ్రీనివాస్ గౌడ్, భాస్కర్ గౌడ్, రవీందర్ రెడ్డి, రామ్మోహన్ రావు కు, క్రీడాకారులకు, కోచులకు, మరియు క్రీడాభిమానులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, ద్వార పోగు విజయ్ బాబు,క్రీడాభిమానులు పాల్గొన్నారు.