క్షయ వ్యాధి నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే 23: తూర్పుగోదావరిజిల్లా బిక్కవోలు మండలంలోని బలభద్రపురం, బిక్కవోలు గ్రామంలో గల సచివాలయం-2 పరిధిలో శనివారం “100 రోజుల టీబీ ముక్త్ భారత్ అభియాన్ – జన భాగిదారి” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిక్కవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ ఎం. దుర్గాదేవి మాట్లాడుతూ క్షయ వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని సూచించారు. క్షయ వ్యాధి ప్రాణాంతకమైనది కాదని, సరైన మందులు మరియు చికిత్సతో పూర్తిగా నయం...