ఖమ్మంలో నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూములు.. చర్యలు తీసుకోవాలని వినతి
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి: ఖమ్మం నగర పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మద్యం దుకాణాల పర్మిట్ రూములపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పలు వైన్‌షాపులకు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూముల్లో అనుమతించిన పరిమితికి మించి సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారని వారు ఆరోపించారు. అదేవిధంగా పర్మిట్ రూముల్లో తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని, ప్లాస్టిక్ వినియోగంపై ఉన్న నిబంధనలను...