పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ జూన్ 27 2026: ఖమ్మం గ్రానైట్ మార్కర్ యూనియన్ అధ్యక్షుడు నువ్వునావత్ కిషన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యాలయంలో సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. అనంతరం సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక అనాధాశ్రమాన్ని సందర్శించి అక్కడి చిన్నారులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన యూనియన్ నాయకులు, సమాజ సేవతో కూడిన జన్మదిన వేడుకలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ సలహాదారులు నరేందర్, వెంపటి వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షుడు వెంపటి ఉపేందర్, వైస్ ప్రెసిడెంట్లు భద్రం, పాష్, గిరి, ట్రెజరర్లు సైదులు, రామ్మూర్తి, కార్యదర్శి జానీ, జాయింట్ సెక్రటరీలు నరసింహారావు, హనుమంతు, ఈసీ సభ్యులు వడ్లకొండ శీను, వెంకటేష్, అంజి, ఫయాజ్, దిలీప్, జీ రమేష్, రఘు, వీరబాబు, దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.