POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 1:31 pm Posted by : POLITICAL POWER

ఖమ్మం జిల్లా ఎన్సీపీ నేతలతో మద్దిశెట్టి సామేలు సమావేశం

జిల్లా కమిటీలు, పార్టీ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చ… పొలిటికల్ పవర్, ఆగస్టు26,ఖమ్మం:ఖమ్మం జిల్లాలో ఎన్సీపీ పార్టీ–ఎన్డీఏ మహాకూటమి కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడంపై పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల ఇన్‌చార్జి మద్దిశెట్టి సామేలు జిల్లా నాయకులతో సమావేశమై చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మీడియా సెల్, యూత్‌ వింగ్‌ నాయకులతో జిల్లా కమిటీల పనితీరు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే అంశాలపై సమీక్షించారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహిస్తూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు.

అనంతరం జిల్లా టీమ్‌ సభ్యులంతా వచ్చే సోమవారం సత్తుపల్లి పార్టీ కార్యాలయానికి హాజరు కావాలని మద్దిశెట్టి సామేలు సూచించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు పుట్టపర్తి హరిబాబు, జిల్లా వర్కింగ్‌ కమిటీ అధ్యక్షులు ఈదుల రవి, రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ పలగాని శ్రీనివాస్ గౌడ్, గరిడేపల్లి రవి, వివిధ మండలాల అధ్యక్షులు, అసెంబ్లీ ఇన్‌చార్జిలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.