POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 5:08 am Posted by : POLITICAL POWER

ఖమ్మం జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా కుక్కల రామకృష్ణ నియామకం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక – పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి ఖమ్మం, జూన్ 14 2026: ఖమ్మం జిల్లా ఐఎన్టీయూసీ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా కుక్కల రామకృష్ణ (ఆర్కే), ప్రధాన కార్యదర్శిగా పగిడిముక్కుల విజయ్‌కుమార్ నియమితులయ్యారు. ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో యువ నాయకుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ చేతుల మీదుగా వారికి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ… ఐఎన్టీయూసీ ఫెడరేషన్ యూనియన్ నూతన జిల్లా కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి పార్టీ నాయకత్వం నిరంతరం అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. నూతనంగా నియమితులైన జిల్లా అధ్యక్షుడు కుక్కల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్‌లు కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.