
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
ఖమ్మం నగరంలో మరోసారి పోలీస్ శాఖ ఖ్యాతి నంబర్ వన్ అని నిరూపితమైంది. సామాన్యుడి కష్టార్జితాన్ని, బాధ్యతాయుతమైన మనసుతో తిరిగి యజమానికి అప్పగించి మనసులను గెలుచుకున్నారు మన ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు.
అసలేం జరిగింది?
ఖమ్మంలోని రద్దీ ప్రాంతమైన జడ్పీ సెంటర్లో ఓ ప్రయాణికుడి ఆటోలో నుంచి అనుకోకుండా జారిపడిన పర్సు రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో అక్కడే అత్యంత అప్రమత్తంగా, నిబద్ధతతో విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కంట ఆ పర్సు పడింది. వెంటనే దానిని స్వాధీనం చేసుకుని ఓపెన్ చేసి చూడగా… అందులో రూ. 9,000 నగదుతో పాటు ఒక పేటీఎం (Paytm) కార్డ్ మాత్రమే లభించింది. వేరే ఇతర గుర్తింపు కార్డులు, అడ్రస్‌లు ఏవీ లేవు!
పోలీసుల పవర్… ఆలోచనలో మాస్ మావెరిక్ స్టైల్!
సాధారణంగా అయితే ఏముందిలే అనుకుని వదిలేయవచ్చు. కానీ, ఖమ్మం ట్రాఫిక్ పోలీసుల డిక్షనరీలో “వదిలేయడం” అనే మాటే లేదు! లభించిన ఆ ఒక్క పేటీఎం కార్డ్ ఆధారంగా రంగంలోకి దిగారు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్. తన టెక్నికల్ స్కిల్స్, పట్టుదలతో ఆ పర్స్ అసలు సిసలు యజమాని అడ్రస్‌ను క్షణాల వ్యవధిలో ట్రేస్ చేసి పట్టుకున్నారు.
అన్నొచ్చాడు.. ఖాకీ సత్తా చాటాడు!
యజమానిని నేరుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు సాదరంగా ఆహ్వానించారు. ఖమ్మం ట్రాఫిక్ సీఐ శివప్రసాద్ గారు స్వయంగా ఆ బాధితుడికి రూ. 9,000 నగదు మరియు పర్సును ఎంతో గౌరవంగా అప్పగించారు.
కష్టపడి సంపాదించుకున్న డబ్బు తిరిగి చేతికి అందడంతో ఆ యజమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. “ఖాకీ అంటే కేవలం లాఠీ మాత్రమే కాదు… పేదవాడికి, ప్రజలకు అండగా నిలిచే నిజమైన రక్షకుడు” అని మరోసారి నిరూపించారు ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు.
నిజాయితీకి మారుపేరుగా నిలిచిన హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ గారికి, ట్రాఫిక్ సీఐ శివప్రసాద్ గారికి మరియు ఆపదలో ఆదుకున్న ట్రాఫిక్ సిబ్బంది అందరికీ అభినందనల ప్రవాహం వెల్లువెత్తుతోంది!