POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 7:30 pm Posted by : POLITICAL POWER

ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం పువ్వాడ ఉదయ నగర్ గ్రామం లో ఇల్లు కూల్చివేత 

ఘటన వెనుక రౌడీ షీటర్లు 

  సర్పంచ్ అండదండలతోనే రెచ్చిపోయిన మూక 

 నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

—– పలు సంఘాల నాయకుల ఆరోపణలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ ఖమ్మం, ఆగస్టు 28 2026: జిల్లా కేంద్రం కు అతి సమీపంలో గల రఘునాధపాలెం మండల పరిధిలోని పువ్వాడ ఉదయ్ నగర్ గ్రామంలో గురువను రాత్రి పేద లంబాడి గిరిజన మహిళ భూక్య నాగేంద్ర అనే మహిళ ఇంటిని కొందరు కూల్చి వేశారు. గురువారం ఉదయం సంఘటన స్థలానికి సందర్శించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గుంతేటి వీరభద్రం , మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దాసరి శ్రీను , బహుజన జెఏసి నాయకులు సంగమేశ్వర రావు , లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బానోతు బద్రు నాయక్ లు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక పేద గిరిజన మహిళ ఇంటిని రాత్రిపూట ఎవరూ లేని సమయంలో కూల్చివేయటం దారుణమని విమర్శిస్తూ ఈ ఘటన వెనుక రౌడీ శీటర్లతోపాటు గంజాయి బ్యాచ్ ఉన్నట్లు

ఆరోపించారు. దీని వెనుక తనకు తాను సిపిఐ నాయకుడిగా ప్రకటించుకుంటున్న యాకోబ్, ఎలుక శివ , స్థానికుడు, మాజీ ఉప సర్పంచ్ భర్త వీరన్న , ప్రస్తుత సర్పంచ్ అనుచరులు ఇస్మాయిల్, వడ్లకుంట శివ మరి కొంతమంది ఈ ఇల్లు కూల్చివేతల్లో పాల్గొన్నట్లు స్థానికులు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని తెలిపారు. అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన పువ్వాడ ఉదయ నగర్ సర్పంచ్ సిద్దిక్ ప్రోబలం సహాయ సహకారాల కారణంగానే ఈ మూక ఈ దారుణానికి పొడిగట్టిందని ఆరోపించారు. గతంలో కూడా ఇదే విధమైన సంఘటన జరిగితే దీనిపై రఘునాధపాలెం పోలీస్ స్టేషన్లో , స్థానిక తాసిల్దారు కు కూడా ఫీ ర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కూల్చి వేసిన ఇంటిని పునర్ నిర్మించి, ఇంటిలోని సామాన్లను ధ్వంసం చేసిన దానికి నష్టపరిహారం నిందితులనుండే వసూలు చేయాలని కోరారు. ఇలాంటి ఘటనలు పువ్వాడ ఉదయ నగర్ లో తరచు సంభవించటం అక్కడి పరిపాలన వ్యవస్థను , అక్కడి శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతుందని పేర్కొన్నారు. ఉన్నత అధికారులు ఇప్పటికైనా పువ్వాడ ఉదయ నగర్ పై దృష్టి సారించాలని , అక్కడి ప్లాట్ల క్రయవిక్రయాలపై సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఉదంతంపై జిల్లా కలెక్టర్ తో పాటు ఖమ్మం పోలీస్ కమిషనర్లకు సోమవారం పలు సంఘాల నాయకులు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్రబాయి, పువ్వాడ ఉదయ నగర్ లో జరిగే పలు అంశాలపై ప్రశ్నించడం కారణంగా, నాగేంద్ర ఆమె బంధువు కావడం ఇల్లు కూల్చివేతకు మరో కారణం అంటూ వివరించారు. వ్యక్తిగత విషయాలలో ప్రతిష్టకు పోయి అమాయక, పేద లంబాడి మహిళ భూక్య నాగేంద్ర ఇల్లు కూల్చివేతకు సిద్ధమైన వీరిని వెంటనే అరెస్టు చేయాలని, వీరందరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నల్ల నాగమణి, ఏ. సరోజిని,వినోద, జక్కం స్వాతి బీ..సుశీల తదితరులు పాల్గొన్నారు.