POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 6:46 pm Posted by : POLITICAL POWER

ఖమ్మం నగరంలో స్థానిక త్రీటౌన్ 28వ డివిజన్ నందు మన్య శ్రీ మంద కృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించినారు: కొల్లి విద్యాసాగర్

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాదిగ రిజర్వేషన్ల పోరాట వ్యవస్థాపక అధ్యక్షులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి మంద కృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు ఖమ్మం నగర ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొల్లి విద్యాసాగర్ స్థానిక ప్రకాష్ నగర్ 28 వ డివిజన్ నందు ఎమ్మార్పీఎస్ జెండా వేసినారు. అనంతరం అద్దంకి శివప్రసాద్ మాదిగ ఆధ్వర్యంలో 29వ డివిజన్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సీనియర్ నాయకులు చిర్రా వెంకన్న, మేకల శ్రీను, మాతంగి అనిల్ కుమార్, పల్లెల శ్రీను, ధర్మారపు వెంకన్న, కొల్లి ఉమా మహేష్, మానుకొండ విజయ్, చక్రవర్తి, కిరణ్, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.