POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 7:48 am Posted by : POLITICAL POWER

ఖమ్మం నగరంలో 58 వ డివిజన్ రమణగుట్ట వడ్డెర సంఘం నూతన కార్యవర్గ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక  

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం నగరంలోని రమణ గుట్ట: 58 వ డివిజన్ రమణ గుట్ట వడ్డెర సంఘం నూతన కార్యవర్గ కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం మరియు స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ నూతన కమిటీ బాధ్యతలను స్వీకరించింది.

నూతన కార్యవర్గ వివరాలు: అధ్యక్షుడు: ఇరగదిండ్ల ఆశయ ఉపాధ్యక్షుడు: పల్లపు గోవిందు ప్రధాన కార్యదర్శి: కుంచపు వెంకటేశ్వర్లు కోశాధికారి: విడగొట్టి వెంకటేశ్వర్లు గౌరవ సలహాదారులు: ఆలకుంట అంజయ్య, విడగొట్టి హనుమంతు, మంజల రమేష్ ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మరియు సభ్యులు మాట్లాడుతూ, వడ్డెర సంఘం బలోపేతానికి, ప్రజల సంక్షేమానికి ఐక్యంగా కృషి చేస్తామని తెలిపారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సంఘం నాయకులకు, సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.