POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 7:30 pm Posted by : POLITICAL POWER

ఖమ్మం నగరం లోని శ్రీనివాస్ నగర్ ఇండ్ల సమస్యపై భవిష్యత్తు కార్యాచరణ చేపడతాం – నున్నా, వై విక్రమ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి

రాజకీయాలు చేయకుండా పేదల వైపు వుండేది ఎర్ర జెండాలు మాత్రమే – నున్నా, వై విక్రమ్

హైకోర్టు ఉత్తర్వు నేపధ్యంలో బాధితులతో సభ నిర్వహించిన CPM పార్టీ…

CPM పార్టీ హైకోర్ట్ లో వేసిన పిటిషన్ నేపధ్యంలో శ్రీనివాస్ నగర్ బాధితులకు ఊరట రావడంతో CPM పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అయ్యప్ప స్వామి గుడి వద్ద సభ నిర్వహించారు. భవిష్యత్తులో శ్రీనివాస్ నగర్ ఇళ్ళ సమస్య శాశ్వతంగా పరిష్కారం ఎలా చేయాలి అనే దానిపై ప్రజల అభిప్రాయాలను నాయకులు తీసుకున్నారు. ఈ సభలో CPM పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్రావు, డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా వరుసగా శ్రీనివాస్ నగర్ ఇళ్ళ సమస్యపై ఒకవైపు ప్రత్యక్ష ఆందోళన చేస్తూనే మరోవైపు CPM పార్టీ హైకోర్ట్ తలుపు తట్టడం ఫలితంగా తాత్కాలిక ఊరట లభించింది అని తెలిపారు. అయితే భవిష్యత్తులో శ్రీనివాస్ నగర్ ఇళ్ళ స్థలాల సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే విధంగా CPM పార్టీ ఆందోళనలు చేయడంతో పాటు కోర్టు లో కూడా సీనియర్ లాయర్ లతో ప్రజల వైపు వాదనలను బలంగా వినిపిస్తాము అని హామీ ఇచ్చారు. గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేదల కుటుంబాలు ఇక్కడే నివాసం శాశ్వతంగా వుండే విధంగా తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. శ్రీనివాస్ నగర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వివిధ రాజకీయ పార్టీలు కేవలం కంటితుడుపు ఆందోళనలు చేస్తున్నాయి అని, కేవలం లెఫ్ట్ పార్టీలు మాత్రమే బాధితుల వైపు వుండి పోరాటాలు చేస్తున్నాయి అని తెలిపారు. నిజాయితీ గా పేదల సమస్యలపై పోరాటాలు చేసేది కేవలం ఎర్ర జెండాలు మాత్రమే అని స్పష్టం చేశారు. ఓట్లు అప్పుడు మాత్రమే మిగతా పార్టీలు కనిపిస్తాయి అని ఆరోపించారు. భవిష్యత్తులో శ్రీనివాస్ నగర్ ఇళ్ళ సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యే వరుకు CPM పార్టీ అటు కోర్టు లోనూ, ఇటు ప్రజా క్షేత్రంలో నూ ప్రజల వైపు వుంటుంది అని తెలిపారు. జిల్లా కలెక్టర్, మంత్రి, కమీషనర్ జోక్యం చేసుకుని పేదల ఇళ్లు కాపాడే విధంగా వుండాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భుక్యా శ్రీనివాసురావు, బండారు రమేష్, SK సైదులు, యర్రా గోపి, SK నాగుల మీరా, SK ఇమామ్, యర్రా రంజిత్, లాయర్ టి లింగయ్య తదితరులు పాల్గొన్నారు