ఖమ్మం నగరాన్ని సమస్యల మయం చేసిన కాంగ్రెస్ పాలన – ప్రజల కష్టాలను పట్టించుకోని ప్రభుత్వం: బీఆర్ఎస్ పార్టీ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి, నగరంలో పేరుకుపోయిన ప్రజా సమస్యలపై మున్సిపల్ డిప్యూటీ కమిషనర్‌ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మం నగర పాలన పూర్తిగా గాడి తప్పిందని మండిపడ్డారు....